ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కూతురు

-

ఆంధ్రప్రదేశ్ బిజెపిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని తొలగించిన అధిష్టానం ఆ స్థానంలో బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు, కేంద్ర మంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణలోకి తీసుకొని కాషాయ పార్టీ పురందేశ్వరికి కొత్త బాధ్యతలను అప్పగించింది.

అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి హై కమాండ్ పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. ఆంధ్రప్రదేశ్ – పురందేశ్వరి, తెలంగాణ – కిషన్ రెడ్డి, జార్ఖండ్ – బాబూలాల్ మారాండ్, పంజాబ్ – సునీల్ జక్కర్, తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ – ఈటెల రాజేందర్ లకు కొత్త బాధ్యతలను అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version