నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ జరుగనుంది. 84వ అల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ, నుమాయిష్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ముఖ్య అతిథిగా పాల్గొని నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నారు.
46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ సాగనుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో 2 వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఫైర్ సేఫ్టీ కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. నాంపల్లి ఎగ్జిబి షన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ప్రారంభం కానున్న తరుణంలో 100 సీసీ కెమెరాలు, సెక్యూరి టీ, వాలంటీర్స్ తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.