ఏలూరులో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదని క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఏలూరు జిల్లా అధికారులు దీనిపై తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదు… ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం అవాస్తవం అంటూ వెల్లడించారు ఏలూరు జిల్లా అధికారులు.
ఉంగుటూరు మం. బాదంపూడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చిపెట్టామన్నారు. కోళ్ల ఫారాల నుంచి కిలోమీటర్ పరిధిని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించి రెడ్ అలర్ట్ జారీ చేశామని వివరించారు ఏలూరు జిల్లా అధికారులు. కాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడం జరిగిందని ప్రచారం జరిగింది. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయిందన్నారు. కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో సాంపిల్స్ సేకరించారట అధికారులు. కానీ అతనికి ఎలాంటి వ్యాధి లేదని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదు
ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం అవాస్తవం.
ఉంగుటూరు మం. బాదంపూడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చిపెట్టాం.
కోళ్ల ఫారాల నుంచి కిలోమీటర్ పరిధిని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించి రెడ్… pic.twitter.com/LnFVAV3bRZ
— greatandhra (@greatandhranews) February 13, 2025