వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ దంపతులకు నోటీసులివ్వాలని డిమాండ్ చేశారు పట్టాభి. హత్య వెనుక సీఎం జగన్ కుటుంబం పాత్ర ఉంది…హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సీఎం జగన్ అనే సమాధానం లభిస్తోందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు అయిన వారు కేవలం పాత్రధారులేనని ఆరోపణలు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్సులో ఉన్నారని.. వివేకా హత్య కేసులో వైఎస్ జగన్.. ఆయన సతీమణి భారతి పాత్ర గురించి సీబీఐ ఆరా తీయాల్సి ఉంటుందని వివరించారు. సీబీఐ జగన్ దంపతులకు సీబీఐ నోటీసివ్వాల్సిన అవసరం ఉంది… భారతీ వ్యక్తిగత సహయకుడు నవీనుకు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారు..? ఏం మాట్లాడారు..? అని నిలదీశారు. సీఎం జగన్.. భారతీ ఇచ్చిన పని పూర్తి చేశామని చెప్పడానికి అవినాష్ పోన్ చేశారా..? భారతీ తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేసే ప్రకాష్ రెడ్డి వివేకా పార్థివ దేహానికి కుట్లు వేయడానికి వెళ్లారా..? లేదా..?అని ప్రశ్నించారు. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేసే ప్రకాష్ రెడ్డి ఎందుకు కుట్లు వేశారు..? అన్నారు పట్టాభి.