Trisha Krishnan : చీరకట్టులో త్రిష సోయగం సూపరహో

-

త్రిష కృష్ణన్ ఈ చెన్నై చిన్నది తాజగా చీరకట్టులో మాయ చేసింది. గ్రీన్ కలర్ చీరలో త్రిష చాలా సింపుల్​గా ఎలిగెంట్​గా కనిపించింది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రచారంలో భాగంగా త్రిష ఈ ఔట్​ఫిట్​లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్రిష సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చీరలో ఈ బ్యూటీ చేసే మాయే వేరు.

త్రిషను ఇలా చీరలో చూసి చాలా కాలమైందని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అప్పుడెప్పుడో వర్షం, అతడు సినిమాల్లో లంగావోణీలో చూశామని.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులో సినిమాలో ఒకసారి చీరకట్టులో చూశామని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత త్రిషను చీరకట్టులో చూసిందేలేదని కామెంట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత త్రిషను ఈ అట్టైర్​లో చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని హార్ట్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు.

త్రిష ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ సినిమాలో త్రిష కుందవిగా నటిస్తోంది. పార్ట్ 1లో త్రిష నటన, అందం ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. మరి పార్ట్ 2లో త్రిష క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version