కోవిడ్ దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న సమయంలో ఏపీలో ఆ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు నిరుపమానం. ఇంటింటికి తిరిగి కోవిడ్ రోగులను గుర్తించి మందులు అందించి వారికి ప్రాణభిక్ష పెట్టిన సేవకులు వీళ్ళు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పొద్దు పొడవక ముందే సంక్షేమ పథకాలను తలుపు తట్టి మరీ గుమ్మం ముందుంచిన సేవా తత్పరులు వాలంటీర్లు. వాలంటీర్ల సేవలను గుర్తించిన ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు సైతం వారి ప్రభుత్వాల్లో వాలంటీర్‌లను నియమించుకున్నారు. ఈ వ్యవస్థపై అధ్యయనం చేసిన రాష్ర్టాలు కూడా ఉన్నాయి.
ఏపీని దేశంలో మోడల్‌గా నిలిపింది ఈ వాలంటీర్ వ్యవస్థ. అలాంటి వాలంటీర్లపై జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్ నోరు పారేసుకున్నారు. వాలంటీర్లపై విమర్శలు చేయడాన్ని వైసీపీ నాయకులు ఆగ్రహం చెందారు. పవన్ చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఎక్కడా.. సభ్యత, సంస్కారం గురించి ఒక్క లైన్ కూడా లేదేమో అందుకే వాలంటీర్లతో 70 శాతం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడావంటూ నిప్పులు చెరిగారు. కోవిడ్ సమయంలో మృతుల కడసారి చూపులకు సైతం బంధుమిత్రులు రాని కష్టకాలంలో ఆ మృతులకు అన్నీ తామే అయ్యిన వాలంటీర్లు అంత్యక్రియలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కానీ పవన్ కళ్ళకు అవి కానరాలేదా అని ప్రశ్నించారు.
”ఎద్దులా ఎదిగావ్.. అయినా బుద్ధి రాలేదు.. ఇకముందు వస్తుందో రాదో …’ ఇది బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో పలికిన డైలాగ్.. తాను చెప్పిన డైలాగే తనకు సరిగ్గా సరిపోయేలా ప్రవర్తన దిగజార్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్.వారం రోజులకోసారి వారాహి యాత్రకు విరామం ఇస్తున్న పవన్ స్క్రిప్ట్ అరువుగా తెచ్చుకుని, ఒంటి మీద సోయికూడా మర్చిపోయి మాట్లాడుతుంటాడు అని మండిపడుతున్నారు. అసలు తాను అనే మాటలకు ఆధారం కానీ.. రుజువులు కానీ లేకుండా నోటికివచ్చినట్లు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్‌గా మారిపోయారని విమర్శిస్తున్నారు.
వాలంటీర్లను కూలీలు, గోనెసంచుల మోసేవాళ్ళు అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఆ తరువాత బుద్ధితెచ్చుకుని టీడీపీ వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అని చెప్పారు. ముసలోడైన చెంద్రబాబుకు ఉన్న తెలివి యువకుడిగా ఉన్న పవన్‌కి లేదని అంటున్నారు. హైదరాబాద్‌లో కాపురం ఉంటూ.. అనధికారికంగా ఏపీలో నివాసం ఉంటూన్న ప్యాకేజీ స్టార్ స్థాయికి మించిన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం చెందారు. అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుని ఆంధ్ర రావడం .. విజయవంతంగా నడుస్తున్న వ్యవస్థల మీద దుమ్మెత్తిపోయడం… మళ్ళీ షూటింగులకు వెళ్లిపోవడం..
ఇదేనా పవన్ దినచర్య అని ప్రశ్నిస్తున్నారు.గతంలో పోటీ చేసిన రెండు చోట్లా జనాలు ఓడగొట్టినా బుద్ధి రాలేదని అంటున్నారు.గోదావరి జిల్లాల్లో ఇష్టానుసారం మాట్లాడి ప్యాకేజి ఎక్కువ బేరం తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లున్నావ్.. కానీ అది జరగదు… మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి. నీకు డబ్బులు కావాలంటే చంద్రబాబు దగ్గర బేరం చేసుకో.. లేదు దెబ్బలే కావాలంటే లక్షలాదిమంది సైన్యం లాంటి వాలంటీర్లతో పెట్టుకో. వాళ్ళ చేతిలో నీకు ఇత్తడే అని వైసీపీ శ్రేణులు పవన్‌ని తిట్టిపోస్తున్నాయి.