ఆదివారం ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఎంపీ నందిగాం సురేష్. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వీధి కుక్కలా తయారయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రజలు రెండు చోట్ల ఓడించినా పవన్ కళ్యాణ్ కి బుద్ధి రాలేదా..? అని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ టిడిపి ఆఫీస్ బాయ్ లా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో పెట్టాలని అన్నారు ఎంపీ సురేష్. ఆయనవి దుర్మార్గపు ఆలోచనలని మండిపడ్డారు. చంద్రబాబు నిఘా సంస్థల డైరెక్షన్ లో ఆయన పనిచేస్తున్నాడని విమర్శించారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు వేసే బిస్కెట్ల కోసం పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు.