జనసేనలో బలమైన లీడర్‌షిప్‌ లేదు – పవన్‌ కళ్యాణ్ సంచలనం

-

జనసేనలో బలమైన లీడర్‌షిప్‌ లేదని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జనసేన పార్టీ గురించి పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో సమన్వయ పరుచుకునే నాయకత్వం లేదన్నారు. మిగితా జిల్లాలతో పోలిస్తే ఉభయగోదావరి జిల్లాల్లో మెరుగ్గా ఉన్నామని వెల్లడించారు.

నేతల్లో పోరాటపటిమ కనబరిచే స్పూర్తి కొరవడిందని… ఈ ఇష్యూని బలంగా అందుకునే లీడర్‌షిప్‌ లేదన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఇక అటు ఏపీ పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పోటీ ఒంటరిగానా ..? పొత్తు లోనా అనేది తేలడానికి చాలా సమయం ఉందని చెప్పారు. పొత్తులు ఉంటాయో ఉండవో తేలే వరకుపార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడ వద్దని కోరారు పవన్‌ కళ్యాణ్‌. పొత్తులపై అధ్యయనం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని.. వైసిపి నీ ఓడించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వ ను అని గతం లో ప్రకటించారు. ఇప్పుడు అధ్యయనం చేశాకే పొత్తు లేదా ఒంటరి పోటీ తెలుస్తానని వివరించారు పవన్ కళ్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version