పవన్ కళ్యాణ్.. చేతకాకపోతే పదవి నుంచి తప్పుకో: కేఏ పాల్

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం విజయవాడ నగరంలో తీవ్రమైన వరద ప్రభావిత ప్రాంతం అయిన సింగ్ నగర్ లో పడవపై ప్రయాణిస్తూ ఆహార పొట్లాలను వరద బాధితులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

 

వరద బాధితులకు సహాయం చేయడం చేతకాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వరదల ధాటికి విజయవాడలో 2300 మంది మరణించారని అన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి కేంద్రం నుంచి పదివేల కోట్ల సహాయాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.

ముంపు ప్రాంతాల్లో ఉన్న వారి కోసం నగరంలోని మిగతావారు కూడా పనిచేసే మానవత్వం చాటుకోవాలని కోరారు పాల్. బుడమేరు కాలువకు వచ్చిన వరద కారణంగా ఎంతో మంది ఇల్లు నాశనం అయ్యాయని.. ఇల్లు నాశనం అయిన వారికి ఇల్లు కట్టించేలా తమతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version