జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం కు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు ఎవరికి కూడా అర్థం కావడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో త్వరలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాదులో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆచితూచి స్పందిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సరే చంద్రబాబునాయుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయటం లేదు. అయితే బీజేపీ నేతలతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.
ఇది ఎంతవరకు నిజం ఏంటనేది పక్కన పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం భారతీయ జనతా పార్టీ విషయంలో దూరం జరగడానికి సిద్ధమయ్యారు. బీజేపీ నేతలతో పెద్దగా మాట్లాడే ప్రయత్నం కూడా ఆయన ఈ మధ్యకాలంలో చేయటం లేదు. రాష్ట్రానికి అన్యాయం చేయడం తో జనసేన పార్టీ కూడా ఇప్పుడు దిగజారిపోతోంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్త పడుతున్నట్లు జనసేన పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్లడం అనేది ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంటుంది అని కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.