ద్వారంపూడి కుటుంబం…పవన్ కళ్యాణ్ సంచలన ఆదేశాలు!

-

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు నోటీసులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ శుద్ధి చేయని వ్యర్థాలను పంట కాలువల్లోకి విడుదల చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పర్యావరణ ఉల్లంఘనలపైనా సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా ఆ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.

pawan kalyan key orders over dwarampudi chandrashekhar

ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌కు టీడీపీ కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్‌లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version