పవన్ కళ్యాణ్ విజయంపై ఆయన తల్లి మాతృమూర్తి అంజనా దేవి స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆయన పార్టీ బరిలోకి దిగిన ప్రతిస్థానాన్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేనానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విజయంపై ఆయన తల్లి మాతృమూర్తి అంజనా దేవి స్పందించారు. ఆమె తన సంతోషాన్ని ఓ వీడియో ద్వారా వ్యక్తం చేశారు. ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఉద్దేశించే ప్రత్యేకంగా మాట్లాడడం అందరినీ ఆకర్షిస్తోంది. ”మా అబ్బాయి రాజకీయాల్లో విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు తగ్గ ఫలితం ఇచ్చాడు. ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతా” అంటూ టీని ఆస్వాదిస్తూ కనిపించారు ఆమె.