కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్యాకప్ అయితే రాజకీయాలు మాట్లాడతారని.. చంద్రబాబు ప్యాకప్ చెబితే షూటింగ్ కి వెళతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి ఇవే ఆఖరు ఎన్నికలని అన్నారు.
ఇక అటు వై.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు అభివృద్ధి కోసం తెచ్చినవే తప్ప టిడిపి హాయంలో మాదిరి దోపిడి కోసం కాదని అన్నారు. టిడిపి హయాంలో 1,80,000 కోట్ల అప్పు చేశారని.. కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ విషయంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి.. టిడిపిని ప్రశ్నించాలని సూచించారు. విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలను ప్రాధాన్యతగా ఎంచుకొని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.