Payyavula Keshav: ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దింతో తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది ఏపీ బడ్జెట్.
ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ఏపీ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు.. గత ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టించిందన్నారు. . వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగింది.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.