టాలీవుడ్ హీరోయిన్స్ కాజల్, తమన్నాలకు బిగ్ షాక్ తగిలింది. కాజల్, తమన్నాలను విచారించనున్నారు పోలీసులు. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాలను విచారించాలని అక్కడి పోలీసులు నిర్ణయించారు.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందొచ్చని ఆశ చూపి రూ.2.40కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ఎంప్లాయ్ కంప్లైంట్ చేశారు. కాగా, క్రిప్టో కరెన్సీ కంపెనీకి సంబంధించిన కార్యక్రమాల్లో తమన్నా, కాజల్ పాల్గొనడంతో విచారించనున్నారట.
- పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ స్కామ్.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను విచారించనున్న పోలీసులు
- క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ జనాలకు టోకరా
- పుదుచ్చేరిలో కేసు నమోదు
- అధిక లాభాల ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40 కోట్లు వసూళ్లు
- అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను విచారించనున్న పోలీసులు