ఇండియా కూటమిలోకి జగన్‌ – మంత్రి పయ్యావుల సంచలనం

-

ఇండియా కూటమిలోకి జగన్‌ వెళుతున్నాడని మంత్రి పయ్యావుల కేశవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి పయ్యావుల కేశవ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలని… ఢిల్లీ రోడ్ల మీద శాంతి భద్రతలపై గగ్గోలు పెట్టడం దేనికి.. సభలోకి వచ్చి జగన్ చర్చించాలని చురకలు అంటించారు మంత్రి పయ్యావుల కేశవ్‌.

payyavula keshav on jagan over india alliance

తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే సభలో చర్చించవచ్చు అని తెలిపారు. ఇవాళే శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేస్తున్నారని వివరించారు. జగన్ రావాలి.. శాంతి భద్రతలపై చర్చలో పాల్గొనాలని కోరారు. ఇండియా కూటమితో చర్చలకు జగన్ ఢిల్లీకి వెళ్లినట్టుందే తప్ప.. ధర్నాకు వెళ్లినట్టు లేదని చురకలు అంటించారు మంత్రి పయ్యావుల కేశవ్‌. గత ఐదేళ్లలో అరాచక పాలన జగన్ చేశారని మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version