ఈ నెల 9న పుంగనూరుకు జగన్‌..కారణం ఇదే

-

ఈ నెల 9న పుంగనూరుకు జగన్‌ రానున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి తెలిపారు. పుంగనూరులో చిన్నారి అస్పియ దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులు ను పరామర్శించారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి మాట్లాడుతూ… చిన్నారి మృతి బాధాకరమన్నారు. ఇంత జరిగిన కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించారు.

Former minister Peddireddy Ramachandra Reddy has been given charge of 11 constituencies in Chittoor district

సీసీటీవీ ఫుటేజ్ లేదని,పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్తున్నారని తెలిపారు. చిన్నారి దారుణంగా చనిపోతే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి. కాని ఏమీ జరగనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రం డిజీపిన హెలికాప్టర్ ఇచ్చి పంపింది…కానీ చిన్నారి చనిపోతే ఇప్పటివరకు సీఎం గాని,మంత్రులు గాని స్పందించలేదని ఆగ్రహించారు. పోలీసులు వెంటనే స్పందించి దోషులను శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి. తొమ్మిదో తారీఖున మాజీ సీఎం జగన్… బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version