వివేకానంద రెడ్డి మరకలు తుడిచిందే ఎర్ర గంగిరెడ్డి..కమలాపురం ఎమ్మెల్యే సంచలనం !

-

వివేకానంద రెడ్డి హత్య కేసుపై కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిచింది ఎర్ర గంగిరెడ్డి అనితెలిపారు. వివేకానంద రెడ్డితో కలిసి యర్ర గంగిరెడ్డి ఒకే కంచం, ఒకే మంచంలో తింటూ స్నేహంగా ఉండేవారు…అటువంటి వ్యక్తి సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని వెల్లడించారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.

Pochimareddy Ravindranath Reddy on ys viveka

వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ అక్కడికి వెళ్ళాడు…వివేకాకు ఎర్ర గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడు కనుక రక్తపు మరకలు తుడిచే సమయంలో అడ్డుకోలేకపోయాడని వివరించారు. అక్కడికి వెళ్లి నిలబడినందుకే అవినాష్ పై ఆరోపణలు వచ్చాయి…అవినాష్ పై ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version