పచ్చ పత్రికలు సిగ్గు పడాలి, పోసాని ఆరోగ్యం పరిస్థితి పై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. రెండు రోజులు హాస్పిటల్ లో ఉన్నా ఆయనకు బెయిల్ వచ్చే పరిస్థితిలేదు, ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విష రాతలు రాస్తోందని… పోసాని కృష్ణమురళి కు వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా ? అంటూ నిలదీశారు.

ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సి ఉంది, ఎన్నాళ్ళీ మోసం అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించలేక పోతున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. మోసపు అబద్ధాలు తో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చుగాక, ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.