బ్లాక్‌ మనీ మొత్తం “హరి హర వీరమల్లు” సినిమాపై పెడుతున్నారు – పోతిన మహేష్ సంచలనం

-

బ్లాక్‌ మనీ మొత్తం “హరి హర వీరమల్లు” సినిమాపై పెడుతున్నారని పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ…జనసేన పార్టీ ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటో చెప్పాలి… అయన ఏజెండా చంద్రబాబు పల్లకి మోయడమేనంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏజెండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడమని ఆగ్రహించారు. కాపులను మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్…జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాలో పోటీ చేయడం లేదన్నారు.

pothina mahesh slams pawan kalyan

 

జనసేన పార్టీ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందొ చెప్పాలి ఎందుకు బహిర్గతం చేయాలి… ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా ఎంత సేకరించరో వెబ్ సైట్ లో పెట్టండి అని మండిపడ్డారు. హరి హరి వీరమల్లు సినిమా 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు…. అసలు ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ఆ సినిమా తరువాత చాలా సినిమాలు పూర్తి చేశారని ఆరోపణలు చేశారు. మీ బ్లాక్ మనీ మొత్తం హరి హరి వీరమల్లు సినిమా మీద పెడుతున్న మాట వాస్తమా కదా ? అని నిలదీశారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మీద ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ పెట్టిన మాట వాస్తవం కదా ? అని ఆగ్రహించారు. 2014- 2024 వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని హిట్ ఎన్ని ప్లాప్ ఎన్ని ? మీరు ఎన్ని ఆస్తులు కొన్నారు మీ బినామీల మీద ఎన్ని ఆస్తులు కొన్నారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version