రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డీఐజీ సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డీఐజీ సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణం రాజును సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారని ధృవీకరణకు వచ్చారు.
సునీల్ నాయక్‌ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ డీఐజీగా ఉన్నారు సునీల్. ప్రస్తుతం బిహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. దీంతో రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డీఐజీ సునీల్ నాయక్ విచారణ ఎదుర్కొనున్నారు.