ఆడపిల్లలు ఉన్న తండ్రులు, ఆడపిల్లలను గౌరవించే ప్రతి ఒక్కరూ భగవంత్ కేసరి సినిమా చూడాలని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. విద్యా వ్యవస్థ ద్వారా వందలాది కోట్ల రూపాయలను తినేయడానికి అలవాటు పడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, విద్యావ్యవస్థను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడితే విద్యార్థులు ఎందుకు పనికిరాకుండా పోతారని చెప్పారు.
దేశంలో జరిగే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వారు రాయలేరని, ఐఏఎస్ పరీక్షల్లోనూ గుప్తుల చరిత్ర గురించే అడిగే అవకాశం ఉందని, ఐబీ సిలబస్ లో గుప్తుల గురించి బోధించే అవకాశం లేదని, ప్రాథమిక విద్య మాతృభాషలో బోధించాలని, ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనను కోరుకుంటే, వారు ఆ మాధ్యమంలో చదువుకోవచ్చునని అన్నారు. గుజరాతి భాషలో మెట్రిక్ వరకు చదువుకున్న గౌతం అదాని గారు సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారని, ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరూ గేటు వద్ద వెయిట్ చేయలేదా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.