బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ఖరారు అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ఖరారైంది. సోము వీర్రాజు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఒక సీటు కేటాయించారు.
కాగా, టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లు ఖరారయ్యాయి. ఇక జనసేన తరఫున కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇది ఇలా ఉండగా… ఎమ్మెల్సీ తనకు రాకపోవటం పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాకు దేవుడు నేను ఆయన భక్తుడిని అంటూ వ్యాఖ్యానించారు. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడని తెలిపారు. నాకు పదవి వచ్చినా రాకపోయినా అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు పిఠాపురం వర్మ కూడా ఈ విషయంలో నిరాశే చెందాడు.