మ్యాట్నీ షో ఫుల్ అయితే మీసాలు తీసేసుకుంటా…వ్యూహంపై రఘురామ ఛాలెంజ్

-

వ్యూహం చిత్రం విడుదలైన తొలిరోజు మ్యాట్నీ షో ఫుల్ అయితే తన మీసాలను తీసేసుకుంటానని రఘురామకృష్ణ రాజు గారు సవాల్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు గొప్ప దర్శకుడని, ఆయన రూపొందిస్తున్న వ్యూహం చిత్రం నవంబర్ 10వ తేదీన విడుదల కానుండగా, శపథం సినిమా జనవరి 25వ తేదీన విడుదల కానుందని, ఈ సినిమాలు రెండో వారానికి సినిమా థియేటర్లలో ఉండవని, తెలియని వారికి ఈ ఊహాచిత్రాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు.

raghurama krishnam raju challenge to rgv

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది విధ్వంసం అయితే, అద్భుతం జరిగినట్లుగా సినిమాలో చూపిస్తారని, ప్రత్యక్షంగా చూసిన వారికి ఆ విధ్వంసం ఏమిటో తెలుసునని, ఒక వ్యక్తి ఆత్మకథలాగా పచ్చి అబద్దాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మన ముందు ఎన్నో అక్రమాలను అరాచకాలను చేసిన వ్యక్తిని స్వామి వివేకానంద గారిలాగా, రామకృష్ణ పరమహంస గారిలాగా చిత్రీకరిస్తే అది చూడడానికి ప్రేక్షకులేమీ వెర్రి వాళ్ళు కాదని అన్నారు. ఈ సినిమాను తమ పార్టీకి కరుడు కట్టిన కుల, మత కార్యకర్తలతో మార్నింగ్ షో ఫుల్ అయినా, మ్యాట్నీ షో కు ప్రేక్షకులే ఉండరని, ఒకవేళ మ్యాట్నీ షో ఫుల్ అయితే తన మీసాలను తొలగించుకుంటానని రఘురామకృష్ణ రాజు గారు సవాల్ చేశారు.

వ్యూహం, శపథం చిత్రాలకు టికెట్లను ఉచితంగా పంచి చూస్తారా?, లేదా? అని బెదిరిస్తారేమో??? చూడాలని అన్నారు. ఇప్పుడు సాక్షి పేపర్లను కూడా ఇంటింటికి ఫ్రీగా పంచుతారత అని, అడ్వర్టైజ్మెంట్ ల రూపంలో, ఎమ్మెల్యే అభ్యర్థుల వద్ద, ప్రభుత్వం వద్ద అడ్డగోలుగా డబ్బులను కొట్టేస్తున్నారని, ఫ్రీగా పంచినా వచ్చే నష్టం లేదని అన్నారు. ప్రభుత్వ సొమ్ముతో సాక్షి పేపర్ కొనుగోలు చేయడాన్ని సవాల్ చేస్తూ రామోజీరావు గారు సుప్రీం కోర్టులో కేసు వేశారని, ఆ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారని, కేసు తీర్పు ఎప్పుడు వెలవడుతుందో తెలియదని, రిజిస్ట్రీ మేనేజ్మెంట్లో తమ పార్టీ నాయకులు పీహెచ్డీ చేసి, డబుల్ పిహెచ్డి దిశగా వెళ్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version