వెబ్ సైట్లో జీవోల అప్ లోడ్..రఘురామ సంచలన వ్యాఖ్యలు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వెబ్సైట్ లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదని న్యాయస్థానం ప్రశ్నించిందని రఘురామకృష్ణ రాజు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదని న్యాయవాది ఉమేష్ చంద్ర గారితో పాటు మరో ముగ్గురు కలిసి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

ఇదే విషయమై ప్రభుత్వం తరఫున చింతల సుమన్ రెడ్డి తన వాదనలను వినిపిస్తూ ఇంపార్టెంట్ జీవోలను అప్లోడ్ చేస్తున్నామని చెప్పారని, ఇంపార్టెంట్ కానివి అప్లోడ్ చేయడం లేదని అన్నారని తెలిపారు. ఇది విన్న న్యాయమూర్తి గారు అన్ని జీవోలను అప్లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసును వాయిదా వేశారని తెలిపారు. అయితే మరుసటి రోజు జిఏడి వాళ్లు ఒక సర్క్యులర్ జారీ చేశారని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించాలని అన్నారని, దీని బట్టి ఇది ఒక డ్రామా అని తేలిపోయిందని అన్నారు. తాము ఎప్పుడో చెప్పామని చెప్పడానికే, ఈ సర్క్యులర్ ను జారీ చేశారని, ఒకవేళ ముందే సర్కులర్ ను జారీ చేసి ఉంటే, కోర్టులో కూడా అదే విషయాన్ని చెప్పి ఉండేవారు కదా అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version