తెలంగాణ ప్రజలు రెండుసార్లు రిస్క్ తీసుకున్నారు.. ఈసారి తీసుకోరు : ఉత్తమ్ కుమార్

-

ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని హుజూర్​నగర్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. రైతు బంధు ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని తెలిపారు. రైతులను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు. రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు.

“రుణమాఫీ ఏకధాటిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చి చూపిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మేడిగడ్డ కుంగిపోయినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సిగ్గు పడాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలు బైబై కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెండు సార్లు రిస్క్ తీసుకున్నారు. ఇకపై రిస్క్ తీసుకోలేరు. బీఆర్ఎస్ కంటే మెరుగ్గా కాంగ్రెస్ పాలన ఉంటుంది. తెలంగాణలో రాబోయేది ప్రజా పాలన. కాంగ్రెస్ అంటే క్రెడిబిలిటి.” అని ఉత్తమ్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version