అరాచక… పైశాచిక పాలనకు చిరునామాగా మారిన ఆంధ్ర ప్రదేశ్ – రఘురామకృష్ణ రాజు

-

అరాచక, పైశాచిక పాలనకు చిరునామా ఆంధ్ర ప్రదేశ్ అని ప్రజలు అనుకుంటున్నారని, ఏపీ అంటే అరాచకత్వం… పైశాచికత్వమని పేర్కొంటున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫైర్ అయ్యారు. అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బేష్ గా ఉన్నాయని డీజీపీ గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, తన పదవీకాలంలో నేర గణాంకాలను చూపెడుతూ, శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.


అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ లిస్ట్ చేయడమే మానివేశారని, ఇక క్రైమ్ రేట్ ను ఎలా అంచనా వేస్తారు? అని అని నిలదీశారు. లారీతో తొక్కించి చంపి వేస్తే, దాన్ని లారీ ప్రమాద కేసుగా నమోదు చేస్తున్నారని, డాక్టర్ సుధాకర్ గారి దారుణ హత్య పోలీసుల దృష్టిలో నేరమే కాదని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 31, 760 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారని, వారి ఆచూకీ ఎక్కడ? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాయ మాటలతో మహిళలను లోబరుచుకొని వారిని తీసుకువెళ్లి ముంబై రెడ్ లైట్ ఏరియాలో సంఘ విద్రోహక శక్తులు విక్రయిస్తున్నారని, నిజంగానే పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల మిస్సింగ్ ను అరికట్టలేరా? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని, గతంలో పనిచేసిన సుచరిత గారు, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న తానేటి వనిత గారికి ఎంత వరకు అధికారాలు ఉన్నాయో అందరికీ తెలుసునని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version