హైదరాబాదులో తుపాకీతో బెదిరిస్తే కేసు పెట్టాల్సింది ఎక్కడ?! -వైసీపీ ఎంపీ

-

మార్గదర్శి సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావు గారు తనని తుపాకీతో నిజంగానే బెదిరించి ఉంటే…యూరి రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది ఎక్కడ అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. మార్గదర్శి ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉండగా, ఆయన ఏపీసీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అసలు యూరి రెడ్డికి, జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. మార్గదర్శి లిస్టెడ్ కంపెనీ అని, షేర్ల డివిడెండ్ లభించకపోతే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ని ఆశ్రయించాలి కానీ యూరి రెడ్డి అదేమీ చేయలేదని తెలిపారు.

ఒకవేళ క్రిమినల్ కేసు పెట్టాలి అనుకుంటే మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న జురిడిక్షన్ లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీసీఐడీ పోలీసులు ఎటువంటి ప్రాథమిక విచారణ జరుపకుండానే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. ఈ కేసు కోర్టులో మూవ్ చేయగా ఒక న్యాయమూర్తి గారు నాట్ బిఫోర్ మీ అన్నారని, మరొక న్యాయమూర్తి గారు రేపు వింటానని చెప్పారని, అప్పటి వరకు ఎటువంటి అరెస్టులు చేయవద్దని ఆదేశించారని తెలిపారు. మార్గదర్శి సంస్థ ఈ కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిందని, ఏపీసీఐడీ పోలీసులు తమ పరిధిలో చోటుచేసుకోని సంఘటనపై కేసు నమోదు చేశారన్న కారణంగా వెంటనే కేసును క్వాష్ చేయాలని, కానీ న్యాయస్థానాలలో మనిషి మనిషికి ఒక న్యాయం అన్నట్లుగా పరిస్థితులు తయారు కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version