నేటి ఏపీలో పెరుగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు..!

-

Registration charges in AP: ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఫిబ్రవరి 1 అంటే నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు లోకి రానున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని పేర్కొంది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి. ముందుగానే ఛార్జీలను సవరించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ ఛార్జీల పెంపు ఎఫెక్ట్‌ తో.. ఏపీలో రిజిస్టర్ ఆఫీసులు..కిటకిటలాడుతున్నాయి. భూమి క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం జనం బారులు తీరారు. నిన్న రాత్రి వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో భూమి క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం జనం బారులు తీరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news