విశాఖ జిల్లా నుంచి సీఎం జగన్ ఎమ్మెల్యేగా పోటీ ?

-

విశాఖలోని నాలుగు స్థానాలలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయండని సవాల్ చేశారు రఘురామకృష్ణ రాజు. జగన్ మోహన్ రెడ్డి గారికి నిజంగా విశాఖపట్నంపై అంత ప్రేమే ఉంటే నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలని రఘురామకృష్ణ రాజు గారు సవాల్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారిపై పోటీకి తాను సిద్ధమేనని ప్రకటించిన ఆయన, విశాఖ నగరంలో పోటీ చేయడానికి కూటమి నేతలను టికెట్ అభ్యర్థించాల్సి ఉంటుందన్నారు.

అయినా జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నగరంలోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదని, ఆయనపై పోటీ చేసేందుకు తాను కూడా కూటమి నాయకులను టికెట్ అడగాల్సిన అవసరం వస్తుందనుకోవడం లేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అలాగే ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ లభించడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version