ఏపీ పోలీసుల బతుకు పులివెందుల బస్టాండ్ అవుతుంది – వైసీపీ ఎంపీ సంచలనం

-

ఆరు నెలల పాటు అధికారంలో ఉండే ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు అక్రమ కేసులను బనాయించే పోలీసుల బ్రతుకు పులివెందుల బస్టాండ్ అవుతుందని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల బూట్లు నాకే కొంత మంది పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, చట్టానికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న వ్యక్తి, సామాన్యులను నిర్బంధించాలని చూస్తే సదరు అధికారిపై ఐపిసి 220 సెక్షన్ కింద ఫిర్యాదు చేయాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.

రామోజీరావు గారి స్థానంలో తాను ఉండి ఉంటే, యూరి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ విభాగం డిఎస్పిపై ఖచ్చితంగా ఐపీసీ 220 సెక్షన్ కింద ఫిర్యాదు చేసి ఉండేవాడినని అన్నారు. ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకుంటారనే నమ్మకం లేదని, అయినా ఆరు నెలల తరువాత ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకొని బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

తమపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 8 వారాల పాటు తదుపరి చర్యలేమి తీసుకోవద్దని న్యాయమూర్తి గారు ఆదేశించారని, ఆరు వారాల్లోగా ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారో చెప్పాలన్నారని తెలిపారు. మార్గదర్శి నుంచి డివిడెంట్ రూపంలో పెద్ద అమౌంట్ చెక్ తీసుకొని ప్రజెంట్ చేసుకున్న వారు , చిన్న అమౌంట్ చెక్ తీసుకొని ప్రజెంట్ చేయకుండా ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version