పాఠశాలల్లో నాడు–నేడు పై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు–నేడుకు ఆదేశాలు ఇచ్చారు జగన్. 14,584 స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4732 కోట్లు వ్యయమవుతుంది అని అధికారులు సిఎం జగన్ కు వివరించారు. 2021 జనవరిలో పనులు ప్రారంభమై… జూన్ నాటికి పూర్తి కానున్నాయి. మొదటి దశలో నాడు నేడు పనులు స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కానున్నాయి.
ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు. అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలన్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలని స్పష్టం చేసారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలని సీఎం ఆదేశాలిచ్చారు. జగనన్న విద్యాకానుక కిట్ పరిశీలించిన సీఎం… పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్ క్లాత్.. అన్నింటినీ నాణ్యంగా ఉండేలా చూడాలని స్పష్టం చేసారు.