ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

-

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని.. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని దాఖలైన పిటీషన్ పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్ర మోటర్ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 8, 770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సి ఉండగా.. 1994 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version