BREAKING: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో సంచలన ప్రకటన చేసింది. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించ వద్దని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ బైసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ వేశారు. దీంతో పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన వాలంటీర్లు రాజీనామా చేయటం వెనుక దురుద్దేశం ఉంది….వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ లో కి వెళ్ళే వరకు ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి కదా అని పేర్కొన్న కోర్టు… చివరికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఓటు ఎవరికి వేయాలి అనేది మాత్రం ఓటర్ దే తుది నిర్ణయం కదా అని తెలిపింది. ఈ తరుణంలోనే వాలంటీర్లు రాజీనామా లు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.