Tillu Qube: ‘టిల్లు క్యూబ్’ సినిమాకు ‘మ్యాడ్’ డైరెక్టర్?

-

Siddhu Jonnalagadda tillu square sequel Tillu Cube: సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ రూపొందించనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.

Siddhu Jonnalagadda tillu square sequel Tillu Cube director and release date update

దీనికి మ్యాడ్ మూవీ ఫెమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మ్యాడ్ స్క్వేర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా,సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు.

ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది.ఇక మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌. భారీ అంచనాలతో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది .

Read more RELATED
Recommended to you

Exit mobile version