Kavali: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో ఆరుగురి అరెస్ట్

-

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి కేసులో ఆరుగురు ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసారు కావలి పోలీసులు. దాడి విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలించిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసారు.

Six arrested in attack on RTC driver

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆరుగురిపై కేసులు కూడా పెట్టారు. దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్ కాగా, మిగిలిన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు. దాడి సంఘటనలో అరెస్ట్ అయిన నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సంఘటనపై నారా లోకేష్‌ స్పందించారు. వైసీపీ అధినేత త‌న అవినీతి దందాల‌కు అడ్డొస్తున్నార‌ని సొంత బాబాయ్‌ని వేసేస్తే, ఆయ‌న సైకో ఫ్యాన్స్ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version