చెప్పు తీస్కోని కొట్టడం వచ్చు – రేవంత్ రెడ్డికి పాల్వాయి స్రవంతి వార్నింగ్ ?

-

చెప్పడం వచ్చు.. చెప్పు తీసుకొని కొట్టడం వచ్చు అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పాల్వాయి స్రవంతి వార్నింగ్ ఇచ్చారు. పాల్వాయి స్రవంతిని నట్టేట ముంచారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇటీవల మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేస్తా అని గ్యారంటీ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ బీజేపీ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి ఇచ్చాడు.

palvai sravanthi slams revanth reddy

ఈ తరుణం లోనే కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పాల్వాయి స్రవంతి వార్నింగ్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ కిరాయిదారుల చేతిలోకి వెళ్లిందని… అసలు సీసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చినవారికి టికెట్లు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి. రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశారని చెప్పకనే చెప్పారు స్రవంతి. కాంగ్రెస్ పార్టీ వదిలేసి బిజెపి పార్టీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులతో రాజకీయం చేస్తామంటే… తాము అస్సలు కాంగ్రెస్ పార్టీలో ఉండబోమని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version