వేముల జలిటిన్ స్టిక్స్ పేలుళ్లపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. వేముల పరిధిలో అక్రమ మైనింగ్స్ చాలా కాలం నుండి కొనసాగుతున్నాయి అని అన్నారు. అలాగే చాలా వరకు లైసెన్స్ పొందిన వాళ్లు మాత్రమే జెలిటెన్స్ టిక్స్ సరఫరా చేయాలి. జెలిటెన్స్ టిక్స్ డిటెనెక్టర్స్ అక్రమంగా స్టోర్ చేసుకున్న వారిపై గత రెండు రోజుల నుండి తనిఖీలు చెప్పట్టము అని తెలిపారు.
వేముల మండల పరిధిలో అక్రమంగా నిలువ ఉంచిన జెలియెన్స్ టిక్స్ ఐదు బాక్సులు సీజ్ చేశాం. వారి మీద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తాం. జెలిటెన్స్ టిక్స్ ని రూల్స్ ప్రకారం డీలర్ దగ్గరనుంచి కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేయడం లేదు అనే విషయాన్ని గుర్తించము అన్నారు. ఇక ఇతర జిల్లాల నుండి జెలిటెన్స్ టిక్స్ జిల్లాలోకి సరఫరా చేయడం. జిల్లాకు చెందిన డీలర్ దే బాధ్యత. రూల్స్ ని అతిక్రమించి జెలిటెన్స్ టిక్స్ కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం అని పేర్కొన్నారు ఎస్పీ.