దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ కు సకుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఈ క్రమంలో విజయవాడ వన్ టౌన్ పోలీస్ వద్ద చేరుకున్నారు విజయవాడలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది. పోలీస్ కుటుంబాలతో కోలాహలంగా మారిపోయింది విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్. పోలీస్ కుటుంబాలను అక్కడ ఏర్పాటు చేసిన కోలాటం, చిన్నపిల్లల నృత్యాలు అకట్టుకుంటున్నాయి.
అయితే ఈ సారి దసరా ఉత్సవాలుకు విజయవాడ కమీషనర్ గా ఉండటం ఆయన అదృష్టం అని , పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం అని తెలిపిన కమిషనర్ విఐపిలు కూడా వారికి కేటాయించిన సమయంలో అమ్మవారి దర్శనాలు చేసుకొవాలని కొరుకుంటున్నాం. దేశ, విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఎర్పాట్లు చేశాం. రేపు ఉదయం నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి అని తెలిపారు.