సీఎం జగన్ కుటుంబ సభ్యుల భద్రత కోసం SSG చట్టం చేశారు. ఈ చట్ట ప్రకారం లండన్ లో ఉన్న సీఎం కుమార్తెలు ఇద్దరికీ అక్కడే స్పెషల్ సెక్యూరిటీ కల్పించనున్నారు. జగన్ సతీమణి భారతి, తల్లి విజయమ్మకు కూడా స్వదేశం, విదేశాల్లో కూడా SSG భద్రత కల్పించనుంది. గవర్నర్ ఆమోదం పొంది, గెజిట్ నోటిఫికేషన్ రాగానే ఈ చట్టం అమలు కానుంది.
ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త అందింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఇకపై ఎప్పుడైనా, ఎక్కడైనా సర్టిఫికెట్లు సులభంగా పొందేలా ఇంటర్ బోర్డు వెసులుబాటు కల్పించింది. పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సి, జెన్యూన్ నెస్ సర్టిఫికెట్లను డిజిలాకర్ లో పొందుపరిచింది. 2014 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తి చేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. దీంతో ధృవపత్రాలు పోగొట్టుకున్న ఈ డిజిలాకర్ ద్వారా తిరిగి పొందవచ్చు.