Srisailam Darshans : కార్తీక మాసం… శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు రద్దు

-

Srisailam Darshans :  శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్. శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీ మల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి పెద్దిరాజు తెలిపారు.

Srisailam Temple Darshans Canceled

శని, ఆది, సోమవారాలతో పాటు సెలవురోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు 4 విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందాలన్నారు. మరోవైపు కార్తికమాసంలోని శని, ఆదివారాల్లో భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ తరుణంలోనే.. శ్రీశైలం భక్తులు ఈ రూల్స్‌ కు అనుగుణంగా వెళ్లాలని కోరారు ఆలయ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version