వెన్నెల కిషోర్ హీరోగా “చారి 111” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

-

టాలీవుడ్ లో కమెడియన్ గా సక్సెస్ అయిన వారు దాదాపుగా హీరోగా కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ తమ కలను నెరవేర్చుకుంటుంటే చాలా వరకు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఆనాటి అలీ, బాబు మోహన్, బ్రహ్మానందం లు ఇలాగే ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు సునీల్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, పోసాని కృష్ణమురళి, సుధీర్, గెట్ అప్ శ్రీను, ప్రియదర్శి, సప్తగిరి మరియు శకలక శంకర్ లాంటి వారు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి కొందరు పర్వాలేదనిపించినా, మరికొందరు ప్లాప్ అయ్యారు. లేటెస్ట్ గా వెన్నెల కిషోర్ రెండవ సారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. ఇంతకు ముందు హ్యాపీ బర్త్ డే సినిమాతో వచ్చినా, ఆకట్టుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు మరోసారి “చారి 111” సినిమాతో ముందుకు రానున్నారు.

ఈ సినిమా టైటిల్ ను చూస్తే స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఇందులో వెన్నెల కిషోర్ సరసన సంయుక్త విశ్వనాథన్ నటిస్తోంది. ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version