జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిగూడెం ఇక రెవెన్యూ డివిజన్ గా మారనుంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పశ్చిమగోదావరి జిల్లాలో డివిజన్ల సంఖ్య మూడుకు పెరిగింది.
కొత్తగా ఏర్పడిన తాడేపల్లిగూడెం డివిజన్ లో తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల పరిధిలో ఐదు మండలాలతో పాటు నరసాపురం డివిజన్ లో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాలు ఉంటాయి. అలాగే భీమవరం డివిజన్ లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలోని…ఆరు మండలాలతో పాటు ఇటీవల జిల్లాలో విలీనం చేసిన గనపవరాన్ని చేర్చారు.అంతేకాదు మరో ఆరు మండలాలను ప్రభుత్వం విభజించింది ఈ మేరకు తుది నోటిఫికేషన్లను జారీ చేశారు.