తాడిపత్రి సీఐ ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం..

-

ఏపీ విషాదం చోటు చేసుకుంది. తాడిపత్రి టౌన్‌ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు తాడిపత్రి టౌన్‌ సీఐ ఆనందరావు. పని ఒత్తిడి కారణంగానే తాడిపత్రి టౌన్‌ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. అయితే.. తాడిపత్రి టౌన్‌ సీఐ ఆనందరావు ఆత్మహత్యపై జెసి ప్రభాకర్ రెడ్డి హాట్‌ కామెంట్స్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని.. నిన్న మధ్యాహ్నం డీఎస్పీ ఆఫీస్ కి సిఐ ఆనందరావు వెళ్ళాడని తెలిపారు. అక్రమ కేసులు పెట్టాలని సీఐపై ఒత్తిడి చేశారని.. నిన్న సిఐ ఆనందరావు ఎవరెవరిని కలిశాడో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version