ఏపీ పోలీసులు వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశానని… ఇసుక మాఫియాని ఆరికట్టాలని జిల్లా ఎస్పీని కోరామని ఈ సందర్భంగా వెల్లడించారు.
పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదని… ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తాడిపత్రిలో ఇసుక మాఫియా గురించి ఎన్జీటీ కి కూడా ఫిర్యాదు చేశామని.. ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయమని అడిగామని తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నామని.. ఎవరు స్పందించక పోవడం వల్ల స్వయంగా నేనే రంగంలోకి దిగానని పేర్కొన్నారు. కచ్చితంగా చెప్తున్నా ఇసుక దందాను జరగనీయను… ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. నన్ను దాదాపు అయిదు గంటల సేపు వర్షంలో నిలబెట్టారు… ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోలేనప్పుడు సీఐ గా ఎందుకు పనిచేయాలని ఆగ్రహించారు. ఇంకా కొంత మంది వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.