డీజీపీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ

-

డీజీపీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఇవాళ లేఖ రాశారు. ముఖ్యంగా ఈ లేఖలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీ-టెక్ రవికి భద్రత కల్పించాలంటూ లేఖలో కోరారు అచ్చెన్న నాయుడు. ఈనెల 29న బీటెక్ రవికి గన్ మేన్లను తొలగిస్తూ.. పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనకు తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని అచ్చెన్నాయుడు కోరారు. మాజీ ఎమ్మెల్సీ బీ టెక్ రవికి భద్రత కల్పించాలి. బీటెక్ రవికి తొలగించిన భద్రతను పునరుద్దరించాలి. 2006 నుంచి బీటెక్ రవికి భద్రత ఉంది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయిపై దాడి చేశారు. బీటెక్ రవికి ప్రాణ హని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version