వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దిరెడ్డిని కలిసి, మంతనాలు జరిపారు కొలికపూడి శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతను కలవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

అటు పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో రెచ్చిపోయారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కొట్టుకోగా.. సెటిల్‌మెంట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు ఎమ్మెల్యే కొలికపూడి. ఎంపీ వర్గపు వ్యక్తిని వదిలేసి, తన అనుచరుడిపై కేసు పెట్టారని పోలీసులపై రెచ్చిపోయిన కొలికపూడి శ్రీనివాసరావు.,.. నియోజకవర్గంలో పోలీసులే ఒక బ్యాచ్‌ను పెట్టుకొని గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో రెచ్చిపోయాయారు.