ఏపీ రాజకీయాల్లో వింత సంస్కృతి కనిపిస్తోంది. ప్రజలకు ఏదైనా.. చేయాలని జగన్ ప్రభుత్వం ఏవైనా కార్య క్రమాలు చేపడితే.. ఇంకేముంది.. ప్రజాధనం వృథా చేసేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు గుండెలు బా దుకుంటున్నాయి. ఇక , వీటి అనుకూల మీడియాలోనూ ఇదే తరహా ఏడుపులు చోటు చేసుకుంటు న్నా యి. పోనీ.. కొందరికి ఇస్తున్నారు కదా.. అనుకుంటే.. అదిగో వాళ్లకు ఇవ్వడం లేదు.. వీళ్లకు ఇవ్వడం లేదు.. మేం అధి కారంలో ఉండగా అందరికీ అన్ని ఇచ్చాం.. అంటూ.. మరో ఏడుపు తెరమీదికి తెస్తున్నా రు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం గోల ఏంటో అర్ధం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు.. మేం వారికి అన్ని నిధులు కేటాయించాం… వీరికి అన్ని నిధులు కేటాయిం చా మంటూ.. లెక్కలు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. నిజం గానే ఆయా వర్గాలకు నిధులు కేటాయిస్తే.. ఇప్పటికీ.. వారంతా అలానే ఎందుకు ఉండిపోయారు? అనేది మిలియ న్ డాలర్ల ప్రశ్న. ఇక, అదే సమయంలో మీరు ఆయా వర్గాలకు కేటాయించడం లేదని వాదిస్తు న్నారు. ఇక, పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వారిది మరో వ్యవహారం.. సీఎం జగన్ పథకాలన్నీ మాయ పేలాలే. ఏడాదిలోనే జగన్ మాయ నుంచి జనం బయటపడ్డారు.
టీడీపీ పథకా లు రద్దుచేసి తెచ్చింది మాయ పథకాలే. రద్దులు.. పేర్లు మార్పుతో జగన్ చేసింది మాయాజాలమే. అని విరుచుకుపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంలో సగానికి సగం కోత పెట్టారు. టీడీపీ 2018-19లో రూ.6,419కోట్లు వ్య యం చేస్తే, వైసీపీ 2019-20లో రూ.3,382కోట్లకు తగ్గించింది. మా ప్రభుత్వంలో రూ.2,767కోట్లు ఎక్కువుగా ఖర్చు చేయడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై టీడీపీకి ఉన్న చిత్తశుద్దికి రుజువుఅన్నారు. ఇక, రాష్ట్ర పార్టీ చీఫ్ కళా వెంకట్రావు గారిది మరో వాదన.
రాష్ట్రంలో ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదన్నది ఆయన వాదన. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. ప్రజలకు ఏదో ఒక రూపంలో చేతికి డబ్బులు అందుతున్నాయి. దీంతో వారు తాము చేయాల్సిన వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎక్కడా కనికట్టు లేదు. ఎవరి సిఫారసు అవసరం కూడా లేదు. అయినా కూడా టీడీపీ నేతల గోలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ గోలేంట్రా అయ్యా! అని నిట్టూర్పు విడుస్తున్నారు.