AP: ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటరు చెంపపై కొట్టాడు ఎమ్మెల్యే. అయితే.. వెంటనే తిరిగి MLAను కొట్టాడు ఓటరు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు, ఓటర్కు మధ్య ఘర్షణ జరిగింది.
ఈ సందర్భంగా ఓటర్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే శివకుమార్. ఆ వెంటనే ఎంఎల్ఏ శివకుమార్ చంపపై దాడి చేశాడు ఓటరు. ఇక అనంతరం సదరు ఓటరు పై శివకుమార్ అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.