కవితపై టీజీ వెంకటేష్ ఫైర్ అయ్యారు. తప్పులు చేస్తే కేటీఆర్, హరీష్ లు కూడా జైలుకే వెళతారని టీజే వెంకటేష్ చురకలు అంటించారు. కవిత కు ఆవేశ పడ్డారు…కేసు పూర్తి అయ్యాక మాట్లాడితే ఒక అర్థం ఉంటుందని తెలిపారు. కవిత చెడుచేసినా చెడు సావాసం వల్ల అమెకు ఈ పరిస్థితి నెలకొందని చురకలు అంటించారు. శశికల లా కవిత అవేశపడి పెద్దలపై మాట్లాడటం కరెక్ట్ కాదని ఎద్దేవా చేశారు.
అలా కాకుండా అవేశపడి పనికి రాని స్టేట్ మెంట్ ఇస్తే అమె నష్టం జరుగుతుంది…బిఆర్ ఎస్ ను టార్గెట్ అనుకుంటే కేటిఆర్ కో, కేసిఆర్ నో అరెస్టు చేసేవాళ్ళమని తెలిపారు. ఎన్నికల ముందు పోత్తులంటాయి..బిఆర్ ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అనేది హాస్యాస్పదమన్నారు. విలీనం అంటే ఇంత తతంగం ఉండేది కాదని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి మొత్తం సమాచారం ఉంది.. గతంలో మేము పనిచేస్తున్నప్పుడు సేకరించిన సమాచారంతో రేవంత్ రెడ్డి ముందుకెలుతున్నాడని చెప్పారు. శ్రీవాణి టికెట్ వచ్చే డబ్బులకు అకౌంట్ బులిటి ఉండాలీ…దోంగనోట్లు కోట్టినట్లు దోంగ టికెట్టు కోట్టి వ్యాపారం చేశారా అనే దానిపై విచారణ జరుగుతుందన్నారు.